Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గ్రేటర్ ఫలితాలు 5గంటల ముందే ఎవరైనా వెల్లడిస్తే చర్యలు తీసుకుంటాం: జీహెచ్ఎంసీ కమిషనర్

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడిపై గ్రేటర్ కమిషనర్ జనార్దన్ రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుందని తెలిపారు. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిర్వహిస్తామని, సాయంత్రం 5 గంటల తరువాత ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆ సమయంకన్నా ముందే ఎవరైనా ఫలితాలు వెల్లడిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదట 26 వార్డులకు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం ఉందని, 6 గంటల కల్లా మరో 26 వార్డులకు సంబంధించిన ఫలితాలు వస్తాయని వివరించారు. ఇక రాత్రి 8 గంటల కల్లా అన్ని వార్డుల ఫలితాలు వెల్లడిస్తామన్నారు. లెక్కింపు కేంద్రాల్లోకి కేవలం ప్రింట్ మీడియాకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని కమిషనర్ తెలిపారు.

More Telugu News